Bihar: అదృష్టమంటే అతడిదే.. యాప్‌లో క్రికెట్ బెట్టింగ్ కాసి కోటీశ్వరుడైన క్షురకుడు!
- బీహార్‌లోని మధుబనికి చెందిన క్షౌరశాల నిర్వాహకుడిని వరించిన అదృష్టం
- డ్రీమ్-11 యాప్‌లో బెట్ కట్టి రూ. కోటి సొంతం
- వృత్తిని మానుకోబోనన్న అశోక్
అదృష్టం ఎప్పుడు, ఏవైపు నుంచి తన్నుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన ఓ క్షౌరశాల నిర్వాహకుడు కూడా అలాగే అనుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన ‘డ్రీమ్-11’లో అశోక్ బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడి ఇంటి తలపు తట్టింది. కోటి రూపాయలు మోసుకొచ్చింది. అంత సొమ్ము గెలుచుకునే సరికి అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచీ ఆసక్తి ఉన్న అతడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘డ్రీమ్-11’లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
విషయం తెలిసి అశోక్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, కోటి రూపాయలు వచ్చినంతమాత్రాన వృత్తిని వదులుకోబోనని చెప్పుకొచ్చాడు. వచ్చిన సొమ్ముతో తొలుత అప్పులు తీర్చి, ఆపై ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.