Japan: జపాన్ కొత్త ప్రధానిగా ఫ్యుమియో కిషిదా.. భారీ మెజారిటీతో ఎంపిక

Fumio kishida elected as New pm of japan

  • ఇక తప్పుకుంటానని చెప్పిన ప్రస్తుత ప్రధాని యోషిహిడే సుగా
  • ఏడాది కూడా గడవక ముందే పలు సమస్యలతో ఇబ్బంది
  • ప్రజల్లో 30 శాతంపైగా తగ్గిన సుగా పాప్యులారిటీ
  • వచ్చే వారం కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఫ్యుమియో కిషిదా

జపాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ఆ దేశ ప్రధాని యోషిహిడే సుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన జపాన్ రాజకీయాల్లో కలకలం రేపింది. మరోసారి ఈ బాధ్యతలు చేపట్టే యోచన తనకు లేదని సుగా స్పష్టం చేసేశారు కూడా. తన స్థానంలో మరో నాయకుడిని ఎన్నుకోవాలని అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి ఆయన ఇటీవల సూచించారు.

ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. వీటిలో ప్యూమియో కిషిదాకు భారీ మెజార్టీ లభించింది. ఆయన గతంలో జపాన్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. జపాన్ ప్రస్తుత ప్రధాని సుగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తికాలేదు. మాజీ ప్రధాని షింజో అబే అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకోవడంతో సుగా ఆ బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం, కరోనా సమయంలోనే టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడం వంటివన్నీ సుగా పాప్యులారిటీని బాగా దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే ఆయన తన పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. వచ్చే వారం నూతన ప్రధాని ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News