Prakash Raj: ప్రకాశ్ రాజ్ ట్వీట్.. బండ్ల గణేశ్ రీట్వీట్!

Bandla Ganesh retweet to Prakash Raj tweet
  • మనస్సాక్షిగా ఓటు వేద్దామన్న ప్రకాశ్ రాజ్
  • తన ప్యానల్ సభ్యుల ఫొటోలను షేర్ చేసిన ప్రకాశ్ రాజ్ 
  • జనరల్ సెక్రటరీ ఓటును మాత్రం తనకు వేయాలన్న బండ్ల గణేశ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రచారపర్వం ఊపందుకుంది. అన్ని ప్యానల్స్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్యానల్ కు ఓటు వేయాలని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కోరారు.

'యువర్ ఓట్ ఈజ్ యువర్ వాయిస్. "మా"హితమే మా అభిమతం... మనస్సాక్షిగా ఓటేద్దాం.. "మా" ఆశయాలను గెలిపిద్దాం' అని ట్వీట్ చేశారు. తమ ప్యానల్ సభ్యుల ఫొటోలను షేర్ చేశారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం బండ్ల గణేశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ఆయన రీట్వీట్ చేశారు. 'జనరల్ సెక్రటరీకి వేసే ఓటును మాత్రం బండ్ల గణేశ్ కు వేయండి' అని కోరారు.
Prakash Raj
Bandla Ganesh
Tollywood
MAA Elections

More Telugu News