CM Jagan: బద్వేలు ఉప ఎన్నికకు వైసీపీ ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి... సీఎం జగన్ వెల్లడి

CM Jagan held meeting on Budvel by election

  • అక్టోబరు 30న బద్వేలు ఉప ఎన్నిక
  • వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ
  • ఉప ఎన్నికపై సీఎం జగన్ సమావేశం
  • సుధను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు

బద్వేలు ఉప ఎన్నికపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. 2019లో కంటే అత్యధిక మెజారిటీతో దాసరి సుధను గెలిపించాలని పిలుపునిచ్చారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని బద్వేలు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో అక్టోబరు 30న ఉప ఎన్నిక నిర్వహిస్తుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News