Mekapati Goutham Reddy: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ విధానం: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
- మంత్రి మేకపాటితో డబ్ల్యూఎఫ్ హెచ్ టీ కమిటీ సమావేశం
- వర్చువల్ గా జరిగిన భేటీ
- హాజరైన సజ్జల, ఉన్నతాధికారులు
- అక్టోబరు 14న మరోసారి సమావేశం
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ (డబ్ల్యూఎఫ్ హెచ్ టీ) కమిటీ వర్చువల్ గా సమావేశమైంది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ఏపీలో వర్క్ ఫ్రం హోం టౌన్ విధానం తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.
వర్క్ ఫ్రం హోం టౌన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ డబ్ల్యూఎఫ్ హెచ్ టీల ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిపారు. తొలుత 25 చోట్ల పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, క్షేత్రస్థాయిలో సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. దీనిపై సజ్జల మాట్లాడుతూ, అక్టోబరు 14న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిపారు.