Narendra Modi: ఈ కార్యక్రమాలు అంబేద్కర్ కలలను సాకారం చేస్తాయి: మోదీ
- స్వచ్ఛ భారత్ 2.0ను ప్రారంభించిన మోదీ
- పట్టణాల్లోని చెత్తపై ఈ పథకం దృష్టి సారిస్తుందన్న ప్రధాని
- నగరాలన్నీ చెత్త రహితంగా మారాలన్న మోదీ
నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయిన వెంటనే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమంలా కొనసాగింది. ఈరోజు ఆయన స్వచ్ఛ భారత్ 2.0ను ప్రారంభించారు. దీంతోపాటు అమృత్ 2.0ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్, అర్బన్ ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్), అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ కార్యక్రమాలు అంబేద్కర్ కలలను సాకారం చేయడంలో ముందడుగు వేస్తాయని చెప్పారు.
స్వచ్ఛ భారత్ 2.0 పథకం పట్టణాల్లోని చెత్తపై దృష్టి సారిస్తుందని మోదీ తెలిపారు. నగరాలు, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని చెప్పారు. 2.0 మిషన్ లో భాగంగా నగరాలన్నీ చెత్త రహితంగా మారాలని అన్నారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఈ మిషన్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.