Manchu Vishnu: సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో మోహన్ బాబు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల సందడి

Manchu Vishnu and his panel members met Superstar Krishna at his residence
  • అక్టోబరు 10న మా ఎన్నికలు
  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్
  • ముమ్మరంగా ప్రచారం
  • సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోరిన మంచు విష్ణు 
ఈ నెల 10న మూవీ ఆర్టిస్ట్స్ (మా) అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీ ప్రచారంలో తలమునకలయ్యాయి. తాజాగా, మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వచ్చారు. వారి వెంట మోహన్ బాబు కూడా వచ్చారు. కృష్ణకు పాదాభివందనం చేసిన మంచు విష్ణు మా ఎన్నికల అంశంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఆశీస్సులు తమపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ... మంచు విష్ణు ప్యానెల్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
Manchu Vishnu
Superstar Krishna
Mohan Babu
MAA Elections
Tollywood

More Telugu News