Shamshabad Airport: హైదరాబాద్ విమాన ప్రయాణికుల నెత్తిన యూడీఎఫ్ భారం.. ఏఈఆర్ఏ గ్రీన్ సిగ్నల్

Hyderabad Airport to hike UDF Charges from april 1st 2022

  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి
  • దేశీయ ప్రయాణికుల నుంచి రూ. 480, విదేశీ ప్రయాణికుల నుంచి రూ.700 వసూలు
  • 2025 నాటికి దీనిని రూ. 700, రూ. 1500 పెంచేలా అనుమతులు

హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ఇది కొంత చేదువార్తే. ప్రయాణికుల నుంచి వసూలు చేసే అభివృద్ధి రుసుము (యూడీఎఫ్)ను దశల వారిగా పెంచుకునేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (జీఏహెచ్ఐఏఎల్)కు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతులు ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 2020 నుంచి ఈ పెంపు మొదలవుతుంది.

దీని ప్రకారం 1 ఏప్రిల్ 2022 నుంచి దేశీయ ప్రయాణికులు యూడీఎఫ్ కింద రూ. 480 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ. 281గా ఉంది. అదే అంతర్జాతీయ ప్రయాణికులైతే రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరు రూ. 393 చెల్లిస్తున్నారు. ఈ రుసుములను 31 డిసెంబరు 2025 నాటికి వరుసగా రూ. 750, 1,500లకు పెంచనున్నారు.

అయితే మూడో నియంత్రణ కాలం (మార్చి 2026) ముగిసే సమయానికి మూడు నెలల ముందుగా ఈ రుసుములను వరుసగా రూ. 500, రూ.1000కి తగ్గించాలని ఏఈఆర్ఏ పేర్కొంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై మూడో నియంత్రణ కాలానికి (ఏప్రిల్ 2021-మార్చి 2026 వరకు) యూడీఎఫ్ టారిఫ్‌ను సవరించాలంటూ జీహెచ్ఐఏఎల్ చేసిన ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని ఏఆఆర్ఏ ఈ అనుమతులు మంజూరు చేసింది.

రెండు నెలల క్రితం అందించిన ఈ ప్రతిపాదనల్లో నేటి (అక్టోబరు 1) నుంచి దేశీయ ప్రయాణికుల యూడీఎఫ్‌ను రూ. 281 నుంచి రూ. 608కి, అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్‌ను రూ. 393 నుంచి రూ. 1,300కు పెంచాలని కోరింది. దశల వారీగా ఈ మొత్తాలను వరుసగా రూ. 728, రూ. 2,200 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

  • Loading...

More Telugu News