monkey: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోతి హల్‌చల్

monkey in indiragandhi international airport
  • జూస్ తాగి, ఆహారం తీసుకెళ్లిన కోతి
  • ఐజీఐ ఎయిర్‌పోర్టులో జరిగినట్లు ఒప్పుకున్న అధికారులు
  • శుక్రవారం జరిగిందంటున్న ప్రయాణికులు
ఎప్పుడూ బిజీగా ఉండే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సడెన్‌గా ఒక కోతి ప్రత్యక్షమైంది. ఇక్కడి బార్‌లో జూస్ తాగి, ఆహారం ఎత్తుకెళ్లింది. ఈ కోతి హల్‌చల్‌ చేయడాన్ని చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. ఈ విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా కోతి రావడం నిజమేనని వారు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని స్పష్టం చేశారు.

అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందీ అధికారులు తెలుపలేదు. ఘటన జరిగిన సమయంలో విమానాశ్రయంలో ఉన్న ఒక ప్రయాణికుడు మాత్రం ఈ కోతి ఘటన శుక్రవారం జరిగినట్లు చెప్పారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలకు ఐజీఐ విమానాశ్రయం ఎంట్రన్స్ పూర్తిగా నీటమునిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కోతి కారణంగా విమానాశ్రయం వార్తల్లో నిలిచింది.
monkey
indiragandhi airport
airport

More Telugu News