Chandrababu: బీసీ ఫెడరేషన్ కన్వీనర్ గా కొల్లు రవీంద్రను నియమించిన చంద్రబాబు

TDP Chief Chandrababu appointed Kollu Ravindra as BC Federation Convener
  • పార్టీ బలోపేతానికి చంద్రబాబు చర్యలు
  • టీడీపీ అనుబంధ సంఘాల నియామకాలు ఖరారు
  • మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్
  • కొత్తగా తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఏర్పాటు
  • అధ్యక్షురాలిగా తేజస్విని పొడపాటి
అన్ని స్థాయిల్లోనూ పార్టీని బలోపేతం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలో టీడీపీ అనుబంధ విభాగాల నియామకాలు ఖరారు చేశారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్ ను నియమించారు. టీడీపీ బీసీ ఫెడరేషన్ కన్వీనర్ గా కొల్లు రవీంద్రను నియమించారు. యువత కోసం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ను కొత్తగా ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ విభాగానికి తేజస్విని పొడపాటిని అధ్యక్షురాలిగా నియమించారు.
Chandrababu
TDP
Kollu Ravindra
BC Federation Convener
Andhra Pradesh

More Telugu News