TTD: తిరుమల బ్రహ్మోత్సవాలు.. సర్వదర్శనం టికెట్లు, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ ఉంటేనే భక్తులకు అనుమతి

Covid vaccination Report must for TTD Devotees
  • దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ టెస్టు రిపోర్టు తప్పనిసరి
  • బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతపై సమీక్ష
  • పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలన్న సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఏవైనా దర్శనం టికెట్లు కలిగి, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగటివ్ రిపోర్టు ఉంటేనే భక్తులను అనుమతిస్తామని తెలిపింది. బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాటపై సమీక్షించేందుకు నిన్న స్థానిక అన్నమయ్య భవనంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, టీటీడీ సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని గోపినాథ్ కోరారు.
TTD
Tirumala
Tirupati
RT PCR Test
Covid Vaccination

More Telugu News