Kinjarapu Ram Mohan Naidu: సన్నబియ్యం ఇస్తామన్న మంత్రి ఇప్పుడు తోక ముడిచారు: కొడాలి నానిపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

TDP MP Rammohan Naidu comments on Kodali Nani
  • నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపణ
  • ప్రజలకు వైసీపీ చేసింది శూన్యమని వ్యాఖ్యలు
  • బూతులు తిట్టడంలో పోటీలు పడుతున్నారని వెల్లడి
  • రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. సన్నబియ్యం ఇస్తామన్న మంత్రి ఇప్పుడు తోకముడిచారని వ్యాఖ్యానించారు. అప్పుల భారం, పన్నుల భారం తప్ప ప్రజలకు వైసీపీ చేసింది శూన్యమని అన్నారు. 22 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని నేతలు బూతులు తిట్టడంలో మాత్రం పోటీలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో వైసీపీ సర్కారు మూడు ముక్కలాట ఆడుతోందని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kinjarapu Ram Mohan Naidu
Kodali Nani
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News