Ysrcp: 130 కోట్లతో బద్వేల్ అభివృద్ధి : మంత్రి ఆదిమూలపు సురేష్

130 crore to develop badwel says YCP Minister

  • గత ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శ
  • టీడీపీ, జనసేన, బీజేపీ ఎజెండా ఒకటే
  • పెండింగ్‌లో ఉన్న బద్వేల్‌ రెవెన్యూ డివిజన్‌కు ఆమోదం


ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉప ఎన్నిక హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేత, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ నియోజకవర్గాన్ని రూ. 130 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వాలు బద్వేల్ ను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల అజెండా ఒక్కటేనని విమర్శించారు. బద్వేల్‌ రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. అలాగే బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు.

ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న బద్వేల్‌ రెవెన్యూ డివిజన్‌కు కూడా ప్రభుత్వ ఆమోదం లభించిందని వెల్లడించారు. బద్వేల్‌ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పిస్తామని హామీ  ఇచ్చారు.

  • Loading...

More Telugu News