Facebook: వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలకు అంతరాయం... నెటిజన్ల విలవిల!

Facebook owned social networking sites faces interruptions
  • సోషల్ మీడియా సర్వీసులు నిలిచిన వైనం
  • ఫిర్యాదులు చేసిన యూజర్లు
  • అవాంతరం ఏర్పడిందన్న ఫేస్ బుక్
  • నిపుణులు సరిదిద్దుతున్నారని వెల్లడి
ప్రపంచంలోని చాలా దేశాల్లో నేడు సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ మూడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్ కు చెందినవే. నెటిజన్లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడడం పట్ల ఫేస్ బుక్ వెంటనే స్పందించింది. 'క్షమించాలి... ఏదో ఇబ్బంది ఏర్పడింది. మా నిపుణులు లోపాన్ని గుర్తించి సరిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరలో సేవలు పునరుద్ధరిస్తాం' అని ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, సోషల్ మీడియా యూజర్లు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ను ఆశ్రయించారు. ఇక, సోషల్ మీడియా విస్తృతిపై ఓ కన్నేసి ఉంచే డౌన్ డిటెక్టర్ అనే పోర్టల్ ఆసక్తికర అంశం వెల్లడించింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడిందని 20 వేల మందికి పైగా ఫిర్యాదులు చేశారని తెలిపింది. వాట్సాప్ పనిచేయడంలేదంటూ 14 వేలమంది, మెసెంజర్ పనిచేయడంలేదంటూ 3 వేల మంది ఫిర్యాదు చేశారని వివరించింది.
Facebook
Whatsapp
Instagram
Mesenger
Social Media

More Telugu News