Aryan Khan: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడు దోషిగా తేలితే.. పదేళ్ల జైలుశిక్ష!
- ఆర్యన్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ
- 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంటే ట్యాబ్లెట్లు సీజ్
- ఎన్‌డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
- దోషిగా తేలితే ఇప్పట్లో బయటకు రావడం కష్టమే
రేవ్ పార్టీలో దొరికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ అగ్రనటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు అర్యన్ కనుక దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన కేసులను బట్టి అతడికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన మరో ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (సి), 20 (బి), 27 రెడ్ విత్ సెక్షన్ 35 ఉన్నాయి. వీరి అరెస్ట్ సందర్భంగా 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 ట్యాబ్లెట్లను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి కేసుల్లో తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటినీ అమలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. వాణిజ్య పరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.