MAA: మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు

Prakash Raj Complains Against Manchu Vishnu Panel
  • ఎన్నికల అధికారికి ఫిర్యాదు
  • పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారని ఆరోపణ
  • అర్హుల సంతకాలు సేకరిస్తున్నారని మండిపాటు
  • కృష్ణ, కృష్ణంరాజు, శారదల ఫీజు కట్టారని ఆగ్రహం
  • ఇంత దిగజారుతారా? అని నిలదీత
‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ లే వాడాలని ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాసిన నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ కూడా విష్ణుపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ప్రకాశ్ రాజ్.. విష్ణు ప్యానెల్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు అనంతరం జీవిత, శ్రీకాంత్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ఏజెంట్లతో కలిసి ‘పోస్టల్ బ్యాలెట్ల’ కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు నిండిన వారంతా పోస్టల్ బ్యాలెట్ కు అర్హులని, దీంతో వారి నుంచి విష్ణు ప్యానెల్ సభ్యులు సంతకాలు సేకరిస్తున్నారని చెప్పారు. నిన్న సాయంత్రం విష్ణు తరఫు వ్యక్తి ఒకరు 56 మంది నుంచి సంతకాలు సేకరించారని, వారి పోస్టల్ బ్యాలెట్ ఫీజు రూ.28 వేలు కట్టారని చెప్పారు.

కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్ బాబు తదితరుల ఫీజునూ విష్ణు తరఫు వ్యక్తే కట్టారని ఆరోపించారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గెలిచేందుకు ఇంత దిగజారుతారా? అని నిలదీశారు. హామీలు చెప్పి గెలవాలని సవాల్ విసిరారు. దీనిపై కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున పెదవి విప్పాలని డిమాండ్ చేశారు.
MAA
Prakash Raj
Manchu Vishnu
Elections
Tollywood

More Telugu News