Nobel Prize: ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గుర్ని వరించిన నోబెల్ ప్రైజ్
- ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ ప్రకటన
- మనాబే, హాసెల్ మన్, పరీసీలకు నోబెల్ పురస్కారం
- భౌతికశాస్త్రంలో పరిశోధనాత్మక రచనలు
- సంక్లిష్ట వ్యవస్థల మూలాలను ఛేదించిన వైనం
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల్లో భాగంగా నేడు భౌతికశాస్త్రంలో విజేతలను ప్రకటించారు. 2021 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ముగ్గుర్ని వరించింది. స్యుకురో మనాబే, క్లాస్ హాసెల్ మన్, జార్జియో పరీసీలను సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు. భౌతికశాస్త్రంలో పరిశోధనాత్మక రచనలకు గాను వీరికి నోబెల్ లభించింది.
సంక్షిష్టమైన భౌతిక వ్యవస్థలకు సంబంధించిన మూలాలను ఛేదించడంలో వీరి పరిశోధనలు, రచనలు ఎనలేనివని నోబెల్ ప్రైజ్ మాతృసంస్థ ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. జపాన్ కు చెందిన స్యుకురో మనాబే వాతావరణ శాస్త్రవేత్త కాగా, క్లాస్ హాసెల్ మన్ జర్మనీకి చెందిన సముద్ర శాస్త్ర నిపుణుడు. ఇక, జార్జియో పరీసి ఇటలీకి చెందిన సిద్ధాంతపరమైన భౌతికశాస్త్ర నిపుణుడు.