Raghu Rama Krishna Raju: జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్
- జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న రఘురాజు
- 11 ఛార్జిషీట్లపై సమగ్రంగా దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నపం
- రెండు, మూడు రోజుల్లో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. వైయస్ జగన్ పై నమోదైన 11 ఛార్జిషీట్లపై సమగ్రంగా దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. రఘురాజు వేసిన పిటిషన్ రెండు, మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ గతంలో రఘురాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇప్పటికే కొట్టేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను తాను ఉల్లంఘించలేదని... కేవలం వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురాజు పిటిషన్ వేశారని జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రఘురాజు పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో రఘురాజు సవాల్ చేశారు.