Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం క్లారిటీ

Centre gives clarity on funds to Polavaram Project
  • నిన్న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన బుగ్గన
  • మరో రూ. 4 వేల కోట్లు ఇవ్వాలన్న జలశక్తి శాఖ విన్నపానికి ఆర్థికశాఖ ఒప్పుకోని వైనం
  • 2017లో కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకే నిధులు అంటూ స్పష్టీకరణ
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిని నిన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిసి విన్నవించారు. మరోవైపు రూ. 4 వేల కోట్లను పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలశక్తి శాఖ కూడా లేఖ రాసింది.

ఈ నేపథ్యంలో బుగ్గనకు కేంద్ర ఆర్థిక శాఖ నిన్న పూర్తి క్లారిటీ ఇచ్చింది. అన్ని ప్రాజెక్టుల మాదిరే పోలవరంకు కూడా నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. 2017లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదాని ప్రకారం రూ. 20 వేల కోట్లకు మించి ఇవ్వలేమని ఆమె స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో పోలవరంకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Polavaram Project
Funds
Union Finance Ministry

More Telugu News