Shahrukh Khan: కస్టడీలో కుమారుడు.. షూటింగులను ఆపేసిన షారుఖ్

Sharukh Khan stops all shootings
  • డ్రగ్స్ కేసులో పట్టుబడిన షారుఖ్ కుమారుడు ఆర్యన్
  • షూటింగులకు రాలేనని దర్శక, నిర్మాతలకు చెప్పిన షారుఖ్
  • ఆగిపోయిన 'పఠాన్' స్పెయిన్ షూటింగ్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీలో ఉన్నాడు. కస్టడీ ఈరోజుతో ముగియనున్న తరుణంలో... కస్టడీని పొడిగించాలని కోర్టును ఎన్సీబీ కోరనున్నట్టు సమాచారం.

మరోవైపు తన కుమారుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో షారుఖ్ ఖాన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తన సినిమాలు, వాణిజ్య ప్రకటనల షూటింగులను నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడేంత వరకు షూటింగులకు రాలేనని దర్శక నిర్మాతలకు షారుఖ్ చెప్పారట.

షారుఖ్ నిర్ణయంతో ఈ నెల 10 నుంచి స్పెయిన్ లో జరగాల్సిన 'పఠాన్' షూటింగ్ ఆగిపోయింది. అంతేకాదు అజయ్ దేవగణ్ తో జరగాల్సిన యాడ్ షూటింగ్ కు ఆయన వెళ్లలేదు. ఈ యాడ్ షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రాంతంలో షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే మధ్యాహ్నం సమయంలో షారుఖ్ ఫోన్ చేసి తాను రాలేనని చెప్పారట. దీంతో, అజయ్ తన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.
Shahrukh Khan
Bollywood
son
Shootings

More Telugu News