Abdulrazak Gurnah: సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ విజేత అబ్దుల్ రజాక్ గుర్నా

Abdulrazak Gurnah won this year Nobel Prize

  • సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన
  • బ్రిటన్ రచయితకు విశిష్ట పురస్కారం
  • శరణార్ధుల కడగండ్లను వివరించిన రజాక్
  • ఆఫ్రికాలో జన్మించి బ్రిటన్ లో స్థిరపడిన సాహితీవేత్త

ప్రపంచ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ను నేడు ప్రకటించారు. 2021 నోబెల్ పురస్కారం బ్రిటీష్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను వరించింది. వలసవాదం, శరణార్థుల సమస్యలను ప్రభావవంతంగా వివరించిన రజాక్... వివిధ ఖండాలు, సంస్కృతుల నడుమ శరణార్థులు ఎలా నలిగిపోతున్నారో తన రచనల ద్వారా కళ్లకు కట్టినట్టు చెప్పారు. తాను చెప్పాల్సిన దానిని  ఎలాంటి రాజీతత్వం అవలంబించకుండా సూటిగా చెప్పిన రజాక్ శైలి తమను ఆకట్టుకుందని నోబెల్ ప్రైజ్ కమిటీ పేర్కొంది.

ఆఫ్రికా దేశం జాంజిబార్ లో జన్మించిన అబ్దుల్ రజాక్ గుర్నా ఓ విద్యార్థిగా బ్రిటన్ లో అడుగుపెట్టి కాలక్రమంలో అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పారడైజ్, బై ద సీ, డెజర్షన్ అనే నవలలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు అందుకున్నారు.

  • Loading...

More Telugu News