Jeevitha: మోహన్ బాబుతో రాజశేఖర్ మాట్లాడింది ఇదే: జీవిత

This is what Raja Sekhar spoke to Mohan Babu says Jeevitha
  • ఇండస్ట్రీలోని వివాదాలపై మాత్రమే మోహన్ బాబుతో చర్చించారు
  • చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని చెప్పుకుంటున్నారు
  • వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్ బాబును రాజశేఖర్ కోరారు
ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో 'ఓటు వేయకండి' అంటూ తాను చేసిన వ్యాఖ్యలను పట్టుకుని... తనను సస్పెండ్ చేస్తానని నరేశ్ చెప్పారని... ఏ తప్పూ చేయకుండా తనను ఎలా సస్పెండ్ చేయగలరని ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయాలనుకుంటే చేయమనండి చూద్దామని అన్నారు. హీరో రాజశేఖర్ తన తండ్రి మోహన్ బాబును కలిసి అనేక విషయాలను చెప్పారంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.

సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదాలపై మాత్రమే మోహన్ బాబుతో రాజశేఖర్ మాట్లాడారని చెప్పారు. చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బయట చెప్పుకుంటున్నారని... ఈ నేపథ్యంలో వివాదాలు సద్దుమణిగేలా చూడాలని మోహన్ బాబును రాజశేఖర్ కోరారని అన్నారు. అంతకు మించి ఆయన ఇతర విషయం గురించి మాట్లాడలేదని చెప్పారు.
Jeevitha
Mohan Babu
Raja Sekhar
Tollywood
MAA

More Telugu News