Arunachal Pradesh: భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
- అరుణాచల్ సెక్టార్‌లో ఘటన
- కొన్ని గంటల పాటు ఘర్షణ
- దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా
భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తూర్పు లడఖ్‌లో మళ్లీ సైనికులను తరలిస్తూ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో చైనా సైనికులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా కౌంటర్ చర్యలు చేపట్టింది.
మరోవైపు, అరుణాచల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అరుణాచల్ సెక్టార్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జపిస్తూనే ఇప్పుడు తూర్పు లడఖ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ వద్ద కూడా చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం గమనార్హం.