Nominations: హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

Nominations for Huzurabad by elections concluded

  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • నామినేషన్లకు నేడు చివరి రోజు
  • నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
  • ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన
  • ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో, నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజున తమ నామినేషన్లు దాఖలు చేశారు. గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్), ఈటల రాజేందర్ (బీజేపీ), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 11న పరిశీలించనున్నారు. ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 30న పోలింగ్, నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News