Vijayasai Reddy: మరికొన్ని వార్తలు ఇవిగో... సంక్షిప్తంగా!

News compilation

  • పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా విజయసాయి
  • రక్షణ శాఖ కమిటీలో మోపిదేవికి చోటు
  • టీమిండియా నెట్ బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్
  • సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అంశంలో కేంద్రం లేఖ

  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. విజయసాయి వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ స్థాయి సంఘంలో 31 మంది ఎంపీలు ఉన్నారు. అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారు.
  • ఐపీఎల్ లో తన వేగంతో అందరినీ ఆకట్టుకున్న సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను టీమిండియా నెట్ బౌలర్ గా ఎంపిక చేశారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన మాలిక్ సేవలను రానున్న టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఉపయోగించుకోనున్నారు.
  • ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ విషయంలో కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గతంలో సునీల్ కుమార్ భార్య అరుణ తెలంగాణ సీఐడీ అధికారులకు చేసిన ఫిర్యాదు విషయంలో తీసుకున్న చర్యలు తెలియజేయాలని ఎంపీ రఘురామ కేంద్రాన్ని కోరడం తెలిసిందే. దీనిపైనే కేంద్ర హోంశాఖ స్పందించింది. కేంద్రం నుంచి వచ్చిన లేఖపై స్పందించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజుకు దిశానిర్దేశం చేశారు. 

  • Loading...

More Telugu News