Raghu Rama Krishna Raju: పవన్, ఉండవల్లి కూడా ప్రశ్నిస్తున్నారు... వారిపైనా రాజద్రోహం కేసు పెడతారా?: రఘురామకృష్ణరాజు

Raghurama Krishna Raju press meet on latest developments
  • రఘురామ ప్రెస్ మీట్
  • ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
  • ప్రశ్నిస్తున్నందుకు తనపై దేశద్రోహం కేసు పెట్టారని ఆరోపణ
  • లక్షల కోట్ల అప్పులపై మాట్లాడడం తప్పా? అంటూ ప్రశ్న  
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర సర్కారుపై మరోసారి స్పందించారు. ఏపీని రుణాంధ్రప్రదేశ్ గా మార్చుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళితే ఇబ్బంది పడేది ప్రజలేనని స్పష్టం చేశారు. లక్షల కోట్ల అప్పులపై ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. ప్రశ్నిస్తున్నందుకే తనపై దేశద్రోహం కేసు పెట్టారని ఆరోపించారు.

ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, పవన్ కల్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నారని, వారిపైనా రాజద్రోహం కేసు పెడతారా? అని ప్రశ్నించారు. పరిస్థితులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినందుకే నన్ను శిక్షించారా? అని రఘురామ వ్యాఖ్యానించారు. పత్రికల బాధ్యతను గుర్తించిన ఆంధ్రజ్యోతి అప్పుల వార్తను ప్రజల ముందుంచిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని అప్పులు చేశారని విమర్శించారు.
Raghu Rama Krishna Raju
AP Govt
Pawan Kalyan
Undavalli Arun Kumar

More Telugu News