Sajjala Ramakrishna Reddy: భవిష్యత్తులో అధికారికంగా విద్యుత్ కోతలు రావొచ్చు: సజ్జల

Sajjala says there may be official power cuts in future
  • విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్న సజ్జల
  • బొగ్గు కొరత ఏర్పడిందని వెల్లడి
  • డబ్బు ఖర్చు చేసినా సమస్య పరిష్కారం కాదని వివరణ
  • ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విద్యుత్ అంశంపై స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. డబ్బు ఖర్చుచేసినా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు.

విద్యుత్ అంశంపై కేంద్రమంత్రి చెప్పింది అవాస్తవం అని సజ్జల అన్నారు. సీఎం ఇప్పటికే ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో అధికారికంగా కోతలు రావొచ్చని వివరించారు. ఇళ్లలో విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కూడా సజ్జల వివరణ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని అన్నారు. అఫిడవిట్లు వేయించడం ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. లబ్దిదారులకు తెలియకుండానే కేసులు పెడుతున్నారని వివరించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళతామని వెల్లడించారు. డివిజన్ బెంచ్ లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు.
Sajjala Ramakrishna Reddy
Power Cuts
Andhra Pradesh
YSRCP

More Telugu News