Nara Lokesh: విద్యుత్ చార్జీలపై సీఎం జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
- రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల మోత
- స్పందించిన లోకేశ్
- ట్రూఅప్ చార్జీల ఉపసంహరణకు డిమాండ్
- ఆరుసార్లు కరెంటు చార్జీలు పెంచారంటూ ఆగ్రహం
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడినపెట్టాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారని ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు తప్ప మరేముందని విమర్శించారు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.20,261 కోట్ల అప్పులు చేశారని, ఆ భారాన్ని ట్రూఅప్ చార్జీల పేరుతో లాగేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. యూనిట్ గరిష్ఠంగా రూ.20కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ లోకేశ్ ప్రశ్నించారు. యూనిట్ కు అదనంగా చెల్లిస్తున్న రూ.10 ఎవరి జేబులోకి వెళుతోందని నిలదీశారు.