Quarantine: క్వారంటైన్ పై వెనక్కి తగ్గిన బ్రిటన్... కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులకు అనుమతి

Britain lifts quarantine measure for Indians

  • భారతీయులకు బ్రిటన్ క్వారంటైన్ నిబంధన  
  • కొవిషీల్డ్ తీసుకున్నా 10 రోజుల క్వారంటైన్
  • దీటుగా స్పందించిన భారత్
  • బ్రిటన్ పౌరులకూ అదే రీతిలో క్వారంటైన్
  • నేడు బ్రిటన్ ప్రధానితో మోదీ సంభాషణ
  • క్వారంటైన్ నిబంధన ఎత్తివేసిన బ్రిటన్

కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశంలోకి భారతీయులను నేరుగా అనుమతించలేమని, 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని బ్రిటన్ ఇటీవల నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దాంతో భారత్ కూడా దీటుగా స్పందిస్తూ, బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ విధిస్తూ నిబంధనలు విధించింది.

ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కీలక సంభాషణ ఫలవంతం అయింది. భారతీయులకు విధించిన క్వారంటైన్ నిబంధన ఉపసంహరించుకునేందుకు బ్రిటన్ నిర్ణయించింది. ఇకపై కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారతీయులను నేరుగా అనుమతించేందుకు సమ్మతి తెలిపింది. ఈ నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. సరైన వ్యాక్సిన్ ధ్రువపత్రాలు చూపితే సరిపోతుందని పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News