MAA Elections: 'మా' పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు... మిగిలిన పదవులకు ఓట్ల లెక్కింపు

MAA votes counting resumed
  • నిన్న 'మా' ఎన్నికలు
  • కొన్ని పదవులకు ఓట్ల లెక్కింపు మిగిలిపోయిన వైనం
  • 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు
  • మంచు విష్ణు ప్యానెల్ కు కీలక పదవులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నిన్న జరగ్గా, మరికొన్ని పదవులకు ఓట్ల లెక్కింపు మిగిలిపోయింది. ఆ పదవులకు నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్ల సభ్యులు 'మా' పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. రెండు ప్యానెళ్ల సమక్షంలో మిగిలిన పదవులకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపును మోహన్ బాబు, మురళీమోహన్ పర్యవేక్షిస్తున్నారు.

'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన సంగతి తెలిసిందే. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులు కూడా మంచు విష్ణు ప్యానెల్ కే లభించాయి. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ గెలిచారు.
MAA Elections
Counting
Resume
JHPS
Hyderabad
Tollywood

More Telugu News