South Central Railway: సికింద్రాబాద్ - ఏపీ మధ్య మరో మూడు దసరా ప్రత్యేక రైళ్లు

South Central railway announce special trains amid dasara
  • సికింద్రాబాద్-కాకినాడ టౌన్
  • లింగంపల్లి-విజయవాడ
  • మచిలీపట్టణం-సికింద్రాబాద్ మధ్య దసరా ప్రత్యేక రైళ్లు
దసరా పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏపీకి మరో మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్-కాకినాడ టౌన్, మచిలీపట్టణం-సికింద్రాబాద్, లింగంపల్లి-విజయవాడ రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07550) రైలు రేపు (14న) రాత్రి 11.55 గంటలకు, మచిలీపట్టణం-సికింద్రాబాద్ రైలు (07450) రాత్రి 9.05 గంటలకు, లింగంపల్లి-విజయవాడ రైలు (07451) 18న రాత్రి 10.45 గంటలకు బయలుదేరుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

 ఈ రైళ్లను దసరా పండుగ ప్రత్యేక రైళ్లుగా నడిపించనున్నట్టు తెలిపింది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ రైలు కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు మీదుగా వెళ్తుందని, మిగతా రెండు రైళ్లు కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొంది. పండుగ రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
South Central Railway
Secunderabad
Kakinada Town
Machilipatnam
Dasara Specials

More Telugu News