Andhra Pradesh: రాత్రివేళ కర్ఫ్యూలో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt reduced night curfew time

  • కరోనా నూతన మార్గదర్శకాలు విడుదల
  • సభలు, సమావేశాలు, శుభకార్యాలకు 250 మంది వరకు హాజరు
  • మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి
  • రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

ఏపీలో మరోమారు కరోనా మార్గదర్శకాలు ప్రకటించారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఫంక్షన్లు, సభలు, సమావేశాలు, సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు గరిష్ఠంగా 250 మంది వరకు హాజరు కావొచ్చని స్పష్టం చేసింది. అయితే కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, తరచుగా శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.

ఇక రాత్రి కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అయితే సమయాలను కాస్త కుదించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించింది.

  • Loading...

More Telugu News