manmohan singh: మన్మోహన్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితిపై బులెటిన్ విడుద‌ల‌

health bulletin on manmohan health
  • నిన్న‌ అస్వస్థతకు గురైన మ‌న్మోహ‌న్
  • ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స‌
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
  • త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్న మోదీ
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురికావ‌డంతో ఆయ‌న‌ను నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు ఈ రోజు ఉద‌యం హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. మ‌న్మోహ‌న్ సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

మ‌రోవైపు, మ‌న్మోహ‌న్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి ప‌లువురు ప్ర‌ముఖులు ఆరా తీస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌ మాండవీయా ఎయిమ్స్‌కు వెళ్లి వైద్యుల‌తో మాట్లాడారు. కాగా, మ‌న్మోహ‌న్ సింగ్ ఎయిమ్స్ లో చేర‌డం ప‌ట్ల‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
manmohan singh
New Delhi
aiims
Narendra Modi

More Telugu News