Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా!

Aryan Khan to be in Jail for one more week
  • ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి   
  • తీర్పును 20కి వాయిదా వేసిన కోర్టు
  • బెయిల్ ఇవ్వొద్దని వాదించిన ఎన్సీబీ
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. డ్రగ్స్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్ పై ఆర్యన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్, ఎన్సీబీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 20న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. దీంతో, అప్పటి వరకు ఆర్యన్ జైల్లోనే ఉండనున్నాడు. మరోవైపు, ఆర్యన్ కు డ్రగ్స్ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉందని కోర్టులో ఎన్సీబీ వాదించింది. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది.
Aryan Khan
Shahrukh Khan
Bollywood
Drugs
Bail

More Telugu News