Maharashtra: సెల‌బ్రిటీల‌ను ప‌ట్టుకోవ‌డం, వారి ఫొటోలు తీయ‌డంపైనే మీరు ఆస‌క్తి చూపుతున్నారు: డ్ర‌గ్స్ కేసుపై ఉద్ధ‌వ్ థాక‌రే

Youre interested to catch celebrities get pictures clicked Maharashtra CM

  • మ‌హారాష్ట్ర‌లో మాత్రమే డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయా?
  • ముంద్రా పోర్టులో కోట్లాది రూపాయ‌ల డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు
  • మా పోలీసులు మాత్రం రూ.150 కోట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

ముంబైలో క్రూయిజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు గుజ‌రాత్‌లోనూ భారీగా డ్ర‌గ్స్ ల‌భ్య‌మ‌య్యాయి. అయితే, డ్ర‌గ్స్ కేసు విష‌యంలో మ‌హారాష్ట్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే ఘాటుగా స్పందించారు.

'మ‌హారాష్ట్ర‌లో మాత్రమే డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయా? ముంద్రా పోర్టులో కోట్లాది రూపాయ‌ల డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ వంటి కేంద్ర ప్ర‌భుత్వ ఎజెన్సీలు కేవ‌లం చిటికెడు గంజాయిని మాత్ర‌మే స్వాధీనం చేసుకుంటుంటే, మా పోలీసులు మాత్రం రూ.150 కోట్ల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సెల‌బ్రిటీల‌ను ప‌ట్టుకోవ‌డం, వారి ఫొటోలు తీయ‌డంపైనే మీరు ఆస‌క్తి చూపుతున్నారు' అని కేంద్ర ప్ర‌భుత్వంపై ఉద్ధ‌వ్ థాక‌రే విమ‌ర్శ‌లు గుప్పించారు.

  • Loading...

More Telugu News