Russia: రష్యాలో విలయం సృష్టిస్తున్న కరోనా.. ఒక్క రోజే వెయ్యి మందికిపైగా మృతి

Russia see 1002 corona deaths in 24 hours

  • 24 గంటల్లో 1002 మరణాలు, 33,208 కేసుల నమోదు
  • అత్యధిక మరణాలు, కేసుల జాబితాలో ఐదో స్థానంలో రష్యా
  • నత్తనడకన సాగుతున్న వ్యాక్సినేషన్

కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో అల్లాడిపోయిన రష్యా మరోమారు దాని కోరల్లో చిక్కుకుంది. కొత్త కేసులు, మరణాలు తాజాగా మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. తొలిసారి 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా (1,002) మరణాలు నమోదయ్యాయి.  33,208 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని దేశ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 79.50 లక్షలకు చేరుకోగా, 2.22 లక్షల మంది కరోనాకు బలయ్యారు.

ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు, కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో నిలిచింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, కరోనా నిబంధనల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడమే కరోనా తాజా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. రష్యాలో ఇప్పటి వరకు 31 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది.

  • Loading...

More Telugu News