Priyanka Gandhi: ప్రియాంక శక్తిసామర్థ్యాలు చూసి రాహుల్‌ గాంధీకి వణుకు.. పీకే వివాదాస్పద వ్యాఖ్యలు

Prashant Kishor Contorversial Comments on Rahul Gandhi
  • ప్రియాంకగాంధీ.. ఇందిరను పోలి ఉంటారు
  • 2017 యూపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించకపోవడానికి కారణం అదే
  • పాట్నాలో రాహుల్‌ను తొలిసారి కలిశా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌తో పీకే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శక్తిసామర్థ్యాలు చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని అన్నారు.

ప్రియాంక అచ్చం నానమ్మ ఇందిరా గాంధీని పోలి ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నారు. అందుకనే ఆమెను చూసి రాహుల్ భయపడుతున్నారని అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించకపోవడానికి కారణం అదేనన్నారు. రాహుల్‌ను తొలిసారి పాట్నాలో కలిశానని, అప్పుడే కాంగ్రెస్‌ కోసం పనిచేయమని అడిగారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. పీకే చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి.
Priyanka Gandhi
Rahul Gandhi
Prashant Kishor
Congress

More Telugu News