Prakash Raj: ఇంకా ఏడు కెమెరాల ఫుటేజి ఎన్నికల అధికారి వద్దే ఉంది: ప్రకాశ్ రాజ్

Prakash Raj disappoints with returning officer
  • మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటున్న ప్రకాశ్ రాజ్
  • ఎన్నికల అధికారి తీరుపై అసంతృప్తి
  • ఇవాళ కొంత ఫుటేజి పరిశీలించామన్న ప్రకాశ్ రాజ్ 
  • మొత్తం ఫుటేజి పరిశీలించాక మాట్లాడతానని వెల్లడి 
మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రకాశ్ రాజ్ వర్గం ఇవాళ సీసీటీవీ కెమెరా ఫుటేజిని పరిశీలించింది. ప్రకాశ్ రాజ్, బెనర్జీ, తనీశ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో వీడియో ఫుటేజిని తనిఖీ చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

"నాకు విష్ణుతో ఇబ్బంది లేదు... సమస్య అంతా ఎన్నికల రిటర్నింగ్ అధికారితోనే. ఎన్నికల వేళ రికార్డయిన సీసీ కెమెరాల ఫుటేజి ఇవ్వాలని ఇటీవల లేఖ రాస్తే, మొదట సరే అన్నారు. ఏం జరిగిందో ఏమో ఆ తర్వాత ఫుటేజి ఇవ్వడం కుదరదన్నారు. దానికో పద్ధతి ఉంటుందని చెబుతున్నారు. మేం దానికి తగ్గట్టుగానే వెళుతున్నాం. ఇవాళ కొంత ఫుటేజి పరిశీలించాం. ఇంకా ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వద్దే ఉంది. దాన్ని కూడా పరిశీలించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు మాట్లాడతాం" అని స్పష్టం చేశారు.
Prakash Raj
Krishna Mohan
Returning Officer
MAA Election

More Telugu News