sensex: సరికొత్త శిఖరాలను తాకిన స్టాక్ మార్కెట్లు

Markets touches new peaks

  • దేశీయ మార్కెట్లలో కొనసాగుతున్న బుల్ జోరు
  • 460 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 139 పాయింట్లు లాభపడిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. ఈ రోజు కూడా మార్కెట్లు రికార్డు స్థాయుల్లో ముగిశాయి. దేశీయంగా నెలకొన్న సానుకూలతలు, ద్రవ్యోల్బణం తగ్గడం, పండుగ సీజన్ విక్రయాలు, త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 61,962 పాయింట్ల ఇంట్రాడే హైని తాకింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి 61,766కి చేరుకుంది. నిఫ్టీ 139 పాయింట్లు పుంజుకుని 18,477 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (4.47%), టెక్ మహీంద్రా (3.36%), టాటా స్టీల్ (2.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.48%), ఐటీసీ (2.30%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.36%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.24%), డాక్టర్ రెడ్డీస్ (-1.73%), ఏసియన్ పెయింట్స్ (-1.66%), బజాజ్ ఆటో (-1.16%).

  • Loading...

More Telugu News