Revanth Reddy: నిరోషాపై వేధింపుల వ్యవహారంలో ఎన్నిక అధికారికి ఫిర్యాదు చేశాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy complains to SEC
  • ప్రశ్నిస్తే వేధిస్తున్నారన్న రేవంత్ రెడ్డి
  • హరీశ్ రావును నిరోషా అనే అమ్మాయి నిలదీసిందని వెల్లడి
  • పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఆమెను వేధించారని ఆరోపణ
  • ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయంటూ ట్వీట్
రాష్ట్రంలో ప్రశ్నించే పౌరులపై వేధింపులు పెరుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావును నిరుద్యోగం అంశంలో ప్రశ్నించిన నిరోషా అనే అమ్మాయిని పోలీసులు, అధికార పక్ష నేతలు వేధించారని రేవంత్ ఆరోపించారు.

ఈ విషయంలో తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇదొక్కటే కాదని, ఇలాంటివే దౌర్జన్యాలు మరెన్నో జరుగుతున్నాయని వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి బాధితురాలితో కలిసి ఎస్ఈసీకి ఫిర్యాదును అందజేసిన విజువల్స్ ఉన్నాయి.
Revanth Reddy
Nirosha
SEC
Harish Rao
Huzurabad
By Polls
Telangana

More Telugu News