Harsha Kumar: టీడీపీ, వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు సరిగాలేదు: మాజీ ఎంపీ హర్షకుమార్

Jagan is supporting attack on Pattabhi house says Harsha Kumar
  • డ్రగ్స్ వ్యవహారంపై ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
  • చంద్రబాబు మాదిరే జగన్ కూడా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు
  • కక్షపూరిత ధోరణి జగన్ కు సరికాదు
డ్రగ్స్, గంజాయి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ... డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

టీడీపీ, వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని... అందుకే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో చంద్రబాబు అహంకారపూరితంగా ప్రవర్తించారని... ఇప్పుడు జగన్ అదే మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని జగన్ సమర్థిస్తున్నారని అన్నారు. కక్షపూరిత ధోరణితో జగన్ వ్యవహరిస్తుండటం సరికాదని చెప్పారు. రాష్ట్రం శాంతియుతంగా ఉండేందుకు టీడీపీ, వైసీపీలు సహకరించాలని కోరారు.
Harsha Kumar
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Pattabhi

More Telugu News