Kommareddy Pattabhiram: పట్టాభి ఇంటిపై దాడిచేసిన వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు

Police filed case against attackers on TDP Leader Pattabhi Home
  • పట్టాభి భార్య చందన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • నిందితులపై పెట్టిన సెక్షన్లపై టీడీపీ నేతల అభ్యంతరం
  • అవన్నీ బెయిలు వచ్చేవేనని వ్యాఖ్య  
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. పట్టాభి భార్య చందన ఫిర్యాదు మేరకు విజయవాడ పటమట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడం, మారణాయుధాలతో వచ్చి గొడవకు దిగడం, దాడికి పాల్పడడం వంటి కేసులను నమోదు చేశారు. 

అయితే, నిందితులపై పెట్టిన  సెక్షన్ల విషయంలో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టాభిని హత్య చేసేందుకే దుండగులు మారణాయుధాలతో వచ్చారని, వారిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పట్టుబట్టినా బెయిలు వచ్చే సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆరోపించారు.
Kommareddy Pattabhiram
TDP
Vijayawada
Police Case

More Telugu News