Kiran Abbavaram: 'సమ్మతమే' నుంచి ఫస్టు గ్లింప్స్!

Sammathame First Glimpse Released
  • కిరణ్ సబ్బవరం నుంచి మరో ప్రేమకథ
  • కథానాయికగా చాందినీ చౌదరి
  • సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర
  • దర్శకుడిగా గోపీనాథ్ రెడ్డి పరిచయం    
కిరణ్ అబ్బవరం ఈ మధ్య వచ్చిన 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'సమ్మతమే' అనే సినిమా చేస్తున్నాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, కంకణాల ప్రవీణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

ఈ సినిమాలో కిరణ్ సబ్బవరం జోడీగా చాందినీ చౌదరి నటిస్తోంది. 'కలర్  ఫోటో' హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మాయి, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను విడుదల చేశారు.

టైటిల్ ను బట్టి ఇది ఒక ప్రేమకథ అనిపిస్తుంది .. ఫస్టు గ్లింప్స్ తో అది నిజమేననే విషయం స్పష్టమవుతుంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ కార్పొరేట్ జాబ్స్ చేస్తూ లవ్ లో పడతారనే విషయం ఫస్టు గ్లింప్స్ వలన అర్థమవుతుంది. ఇక హీరోయిన్ మందుకొడుతూ .. సిగరెట్ తాగుతూ హీరోకి షాక్ ఇవ్వడం ఈ వీడియోలోని కొసమెరుపు.
Kiran Abbavaram

More Telugu News