Aryan Khan: బెయిల్ కోసం హైకోర్టుకెళ్లిన ఆర్యన్ ఖాన్

Aryan Khan Appeal For Bail In Bombay High Court
  • బాంబే హైకోర్టులో ఆర్యన్ తరఫు లాయర్ పిటిషన్
  • వచ్చే మంగళవారం విచారిస్తామన్న కోర్టు
  • నిన్న బెయిల్ ను తిరస్కరించిన స్పెషల్ కోర్టు
బెయిల్ కోసం షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాంబే హైకోర్టు మెట్లెక్కారు. ముంబై ప్రత్యేక కోర్టు నిన్న ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ పిటిషన్ ను మరోసారి తిరస్కరించడంతో.. వేరేదారి లేక హైకోర్టుకు వెళ్లారు. ఇవాళ ఉదయం ఆర్యన్ తరఫు లాయర్ సతీశ్ మనిషిండే తన టీంతో కలిసి పిటిషన్ వేశారు. అయితే, వచ్చే మంగళవారం పిటిషన్ ను విచారిస్తామని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

ఈనెల 3న ముంబై సముద్ర తీరంలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఆర్యన్, అతడి మిత్రులు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. ఇవాళే షారూఖ్ ఖాన్ తన కుమారుడిని జైలులో కలిసి వచ్చారు.
Aryan Khan
Shahrukh Khan
Bollywood
Drugs Case
Cruise Party
Bombay High Court
High Court

More Telugu News