Balineni Srinivasa Reddy: అందుకే ప‌ట్టాభి బూతులు మాట్లాడారు: ఏపీ మంత్రి బాలినేని

balineni slams chandrababu
  • చంద్రబాబు చేస్తోన్న‌ దీక్ష దొంగ దీక్ష
  • కుట్రలకు పాల్ప‌డ‌తామంటే ఊరుకోం
  • పట్టాభి వాడిన భాష‌ను చంద్రబాబు స‌మ‌ర్థిస్తారా?
  • చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లోనే ప‌ట్టాభి అలా మాట్లాడారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆం‍ధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీడీపీ నేత‌ పట్టాభి బూతులు మాట్లాడారని ఆయ‌న ఆరోపించారు. చంద్రబాబు చేస్తోన్న‌ దీక్ష దొంగ దీక్ష అని ఆయ‌న అన్నారు. ఏపీలో టీడీపీ నేత‌లు కుట్రలకు పాల్ప‌డ‌తామంటే తాము ఊరుకోబోమని ఆయ‌న చెప్పారు.

పట్టాభి వాడిన భాష‌ను చంద్రబాబు స‌మ‌ర్థిస్తారా? అని ఆయ‌న నిల‌దీశారు. గతంలోనూ టీడీపీ నేత‌లు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్ర‌య‌త్నాలు జ‌రిపార‌ని, దేవు‌డి రథాలు తగలబెట్టించారని ఆయ‌న‌ ఆరోపించారు. చంద్ర‌బాబు నాయుడు జీవితమంతా కుట్రలమయమని ఆయ‌న విమ‌ర్శించారు.
Balineni Srinivasa Reddy
YSRCP
Chandrababu

More Telugu News