Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా భారీ నష్టాలే!
- 336 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 88 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6.82 శాతం లాభపడ్డ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, రియాల్టీ స్టాకులు ఒత్తిడి ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336 పాయింట్లు నష్టపోయి 60,923కి దిగజారింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 18,178 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (6.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.77%), ఎన్టీపీసీ (1.06%), యాక్సిస్ బ్యాంక్ (1.01%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-4.85%), ఇన్ఫోసిస్ (-2.42%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.40%), టీసీఎస్ (-2.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.05%).