Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ రిమాండ్ పొడిగింపు

Court extends Aryan Khan remand
  • ఈ నెల 3న అరెస్టయిన షారుఖ్ తనయుడు
  • ఈ నెల 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు
  • బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఆర్యన్
బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టు డ్రగ్స్ కేసులో రిమాండ్ పొడిగించింది. ఆర్యన్ కు అక్టోబరు 30 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబయిలోని ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

 ఆర్యన్ ఈ నెల 3న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకంపై సమాచారంతో పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.

ఇక, డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి అనన్య పాండేకి చెందిన ఫోన్, ల్యాప్ టాప్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Aryan Khan
Remand
Judicial Custody
NDPS Special Court
Drugs Case
Mumbai
Bollywood

More Telugu News