Scotland: టీ20 వరల్డ్ కప్: ఒమన్ ను స్వల్ప స్కోరుకు కట్టడి చేసిన స్కాట్లాండ్

Scotland restricts Oman for low score
  • టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఒమన్
  • 20 ఓవర్లలో 122 ఆలౌట్
  • రాణించిన ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్, కెప్టెన్ మక్సూద్
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశకు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శన చేశారు. ఒమన్ జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్ 37, కెప్టెన్ జీషన్ మక్సూద్ 34, మహ్మద్ నదీమ్ 25 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో డేవీ 3, షరీఫ్ 2, లీస్క్ 2, మార్క్ వాట్ 1 వికెట్ తీశారు. లక్ష్యఛేదనను స్కాట్లాండ్ ఆశాజనకంగా ప్రారంభించింది. 5 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
Scotland
Oman
Low Total
T20 World Cup

More Telugu News