Whatsapp: యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్న వాట్సాప్

Whatsapp set to introduce new features for users

  • సోషల్ మెసేజింగ్ లో అగ్రగామిగా వాట్సాప్
  • యూజర్లకు మరింత సౌలభ్యం కోసం నయా ఫీచర్లు
  • వాట్సాప్ గ్రూప్ స్థానంలో కమ్యూనిటీ ఫీచర్
  • ఆడియో సందేశాల్లో మార్పులు చేర్పుల కోసం ప్రివ్యూ ఫీచర్

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లకు రంగం సిద్ధం చేస్తోంది. యూజర్లకు మెరుగైన సేవలు అందించే క్రమంలో తాజా ఫీచర్లతో వస్తోంది. వాటిలో ఆడియో మెసేజ్ ప్రివ్యూ, వాట్సాప్ కమ్యూనిటీ, వాట్సాప్ ప్లేయర్, మీడియా అన్ డు, మల్టీ డివైస్ సపోర్ట్ ముఖ్యమైనవి.

వాట్సాప్ లో ఆడియో సందేశాలు పంపొచ్చన్న సంగతి తెలిసిందే. అయితే ఒకసారి రికార్డు చేసిన ఆడియో మెసేజ్ ను ఎడిట్ చేయడం కుదిరేది కాదు. అయితే, మార్పులు చేర్పులకు వీలు కల్పించే ఆడియో మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. ఆడియో సందేశం రికార్డు చేసిన తర్వాత దాన్ని మనం ఓసారి వినొచ్చు. అవసరమైన మార్పులతో కొత్త మెసేజ్ రూపొందించవచ్చు.

వాట్సాప్ లో పంపించే ఆడియో సందేశాలు వినేందుకు ప్లేయర్ ఫీచర్ కు మెరుగులు దిద్దుతోంది. యూజర్లు పెద్ద సైజులో ఉండే ఆడియో సందేశాలను వింటూనే చాటింగ్ చేసే వెసులుబాటు ఈ ప్లేయర్ ఫీచర్ తో కలుగుతుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించుకునే క్రమంలో తమకు వచ్చిన ఆడియో మెసేజ్ ను యూజర్లు తొలుత పిన్ చేయాలి. ఆ తర్వాత ప్లే చేస్తూ, ఇతరులతో చాట్ చేసుకోవచ్చు.

ఇక ఒక వాట్సాప్ ఖాతాను రెండు ఫోన్లలో ఉపయోగించుకునేలా మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ తీసుకువస్తోంది .ఈ ఫీచర్ సాయంతో ఒకే వాట్సాప్ ఖాతాను ఫోన్ లోనూ, ట్యాబ్, డెస్క్ టాప్ పీసీలోనూ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇది బేటా వెర్షన్ లో ఉంది.

వాట్సాప్ ప్రవేశపెట్టబోయే మరో ఫీచర్... కమ్యూనిటీ. వాట్సాప్ లో ఇప్పటిదాకా గ్రూప్ ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ స్థానంలోనే కమ్యూనిటీ ఫీచర్ రానుంది. యూజర్లు ఓ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకుని, అందులోనే గ్రూప్ లను కూడా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం దీనివల్ల కలుగుతుంది.

  • Loading...

More Telugu News