Ananya Pandey: వరుసగా రెండో రోజూ ఎన్సీబీ విచారణకు హాజరైన అనన్య పాండే

Bollywood actress Ananya Pandey attends NCB questioning in drugs case
  • డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ అరెస్ట్
  • ఆర్యన్ కాల్ డేటాలో అనన్య పేరు
  • సమన్లు జారీ చేసిన పోలీసులు
  • సోమవారం కూడా విచారణకు రావాలన్న పోలీసులు
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్య పాండే వరుసగా రెండో రోజు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. ఆమెను ఎన్సీబీ అధికారులు సుమారు 4 గంటల పాటు ప్రశ్నించారు. అనన్య... ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ అందించినట్టు గతంలో ఓ వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడైందని ఎన్సీబీ అధికారులు పేర్కొంటుండగా, తాను ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని అనన్య పేర్కొంది.

గంజాయి గురించి అడిగిన ఆర్యన్ తో కేవలం తాను జోక్ చేశానని... అంతే తప్ప డ్రగ్స్ గురించి తనకేమీ తెలియదని అధికారులకు స్పష్టం చేసింది. ఆమె నుంచి ఇంకా సమాచారం సేకరించాలని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు సోమవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు.

ఈ నెల మొదటివారంలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ను పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆర్యన్ వాట్సాప్ డేటా పరిశీలించగా, అనన్య పాండేతో చాటింగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు.
Ananya Pandey
Drugs Case
NCB
Aryan Khan
Bollywood

More Telugu News